ఎన్ మార్ట్ ఏజెంట్ల అరెస్టు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎన్ మార్ట్ ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేసారు. 'తక్కువ మొత్తం డిపాజిట్ చెయ్యండి, లక్షలు సంపాదించండి' అంటూ వందల కోట్లకు టోకరా వేసిన ఎన్ మార్ట్ కు చెందిన ఏడుగురు ఏజెంట్లను ప్రకాశం జిల్లా కందుకూరు పోలీసులు అరెస్టు చేసారు. గొలుసు కట్టు వ్యాపారంలో ఈ జిల్లానుంచి 14 కోట్ల రూపాయాలు వసూలు చేసారీ ఏజెంట్లు. వీరి నుంచి ఒక కారు పలు కంప్యూటర్లు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు.